manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 8:51 am Editor : manabharath

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – రంగారెడ్డి బస్సు ప్రమాదం కన్నీరుమన్నారులు

మన భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఒక కుటుంబంలో శోకసంద్రాన్ని మిగిల్చింది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కుటుంబం మీద విషాదం ముసురుకుంది. ఆయన ముగ్గురు కూతుళ్లు — నందిని (డిగ్రీ ఫస్ట్ ఇయర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

ముగ్గురూ హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి కోసం తాండూరుకు వచ్చి, ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకరతో నిండిన టిప్పర్ లారీని ఢీకొనడంతో మృతి చెందారు.

ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవడంతో తాండూరు పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువులు, స్నేహితులు, స్థానికులు వారి కుటుంబానికి పరామర్శలకు తరలివస్తున్నారు.

🚨 ఒకే కుటుంబంలోని ముగ్గురు పువ్వులు ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రజల హృదయాలను కదిలించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.