manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 7:20 am Editor : manabharath

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన..

ఆదిలాబాద్‌లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన.. రైతులతో భేటీకి సన్నాహాలు

మన భారత్, ఆదిలాబాద్: బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం ఆమె కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతులతో సమస్యలు తెలుసుకోనున్నారు.

మరికాసేపట్లో కవిత కాటన్ మార్కెట్ చేరుకొని రైతులతో ముఖాముఖీ చర్చ జరపనున్నారు. పత్తి ధరలు, వ్యవసాయ విధానాలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన ఉన్నట్లు జాగృతి నాయకులు తెలిపారు. తరువాత ఆమె కొర్ట చనాక ప్రాజెక్టును సందర్శించనున్నారు.

ఈ సందర్బంగా జిల్లా జాగృతి నాయకులు రంగినేని శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కవిత పర్యటనతో జిల్లా రాజకీయ వాతావరణం కాస్త ఉత్కంఠభరితంగా మారింది.

🚩కవిత పర్యటనలో జాగృతి కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.