manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 November 2025, 8:01 am Editor : manabharath

సీఎం వ్యాఖ్యలపై బిజెపి నేతల ఆగ్రహం..

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బిజెపి నేతల ఆగ్రహం.. నర్సాపూర్‌లో దిష్టిబొమ్మ దహనం

మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ సైనికులపై మరియు భారతీయ జనతా పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బిజెపి పిలుపుమేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆదివారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి ఓబిసి ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి బాదే బాలరాజ్, జిల్లా ఓబిసి ఉపాధ్యక్షుడు గుండం శంకర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సంఘసాని రాజు, రామ్ రెడ్డి, ఎస్టీ మోర్చా జి.ఎస్. రాములు నాయక్, ఎస్సీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ పబ్బూరి కృష్ణ, కో-కన్వీనర్ సిర్మోని నరేందర్, బిజెపి నాయకులు ప్రేమ్ కుమార్, సంజీవరెడ్డి, బాలు, నర్సింగరావు, రాజు, దుర్గ ప్రసాద్, నారాయణపూర్ బూత్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

నాయకులు మాట్లాడుతూ, దేశ సైనికుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశాభిమానులను అవమానించేలా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. సైనికుల త్యాగాలను అవమానించే వ్యాఖ్యలు అసహ్యకరమని, సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.