ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..
రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మన భారత్, మెదక్ జిల్లా, నవంబర్ 2: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐకెపి నిర్వాహకురాలు కమ్మరి శ్యామల మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాలకు తరలించాలని సూచించారు. దళాలకు విక్రయిస్తే నష్టపోవాల్సి వస్తుందని...