ప్రత్యేక ప్రధాన సలహాదారునిగా నియామకంపై సుదర్శన్ రెడ్డికి ఘన సన్మానం
మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1:
బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన సలహాదారునిగా క్యాబినెట్ హోదాతో నియమితులైన నేపథ్యంలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఈ నియామకంపై శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బోధన్ పట్టణ ప్రముఖులు, ట్రస్మా సభ్యులు ఘనంగా సత్కరించారు.
సుదర్శన్ రెడ్డిని శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించిన ప్రముఖులు, “బోధన్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సుదర్శన్ రెడ్డి కొత్త బాధ్యతల్లో మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాం,” అన్నారు.
ప్రముఖులు మాట్లాడుతూ, ఆయన కృషితో బోధన్ పట్టణం అభివృద్ధి దిశగా నడుస్తోందని, ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. “రాష్ట్ర అభివృద్ధికి విలువైన సూచనలు అందించే నాయకుడు సుదర్శన్ రెడ్డి,” అని పేర్కొన్నారు.
తమ నాయకుడిని ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి బసవేశ్వర్ రావు, బీజేపీ సీనియర్ నాయకుడు నరసింహ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్, గౌరవ సలహాదారులు యార్లగడ్డ శ్రీనివాస్, చక్రవర్తి, ట్రస్మా పట్టణ కమిటీ సభ్యులు హరికృష్ణ, దుష్యంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.