హైదరాబాద్‌లో జరిగే ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నాయకులు
మన భారత్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన ,నవంబర్ 1: పద్మశ్రీ అవార్డు గ్రహీత, మందకృష్ణ మాధిగ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇంద్రపార్క్ నుండి ప్రారంభమయ్యే ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి రెబ్బెన మండలం నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా బయలుదేరారు.
అన్నగారి ఆదేశాల మేరకు ఈ ర్యాలీకి హాజరవ్వడానికి రెబ్బెన గ్రామపంచాయతీ ప్రాంగణం వద్ద గోగర్ల రాజేష్, చిలుముల నర్సింహులు, తైదల కృష్ణ, గొగర్ల రాజేష్, రోడ్డ శంకర్, గోగార్ల శ్రీనివాస్, అవిడపు గోపి, తిరుపతి మరియు పలువురు నాయకులు ఒకచోట చేరి, ర్యాలీ విజయవంతం చేయాలని సంకల్పబద్ధత వ్యక్తం చేశారు.
నాయకులు మాట్లాడుతూ, “మందకృష్ణ మాధిగ ఆత్మగౌరవ యాత్ర దళిత సమాజ గౌరవం కోసం చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమం. సమాజంలోని పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అందరం ఐక్యంగా కృషి చేయాలి” అని అన్నారు.
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ర్యాలీకి వెళ్తూ నినాదాలతో మారుమ్రోగించారు. ర్యాలీ ద్వారా ప్రభుత్వం దళితుల హక్కుల సాధనకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.