💰చెత్తలో నిధి..! యాచకురాలి దగ్గర నోట్ల కట్టలు..!
మంగళూరులో సంచలన సంఘటన — ప్రజలు, పోలీసులు ఆశ్చర్యంలో! మన భారత్, స్టేట్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో ఓ ఆశ్చర్యకర సంఘటన వెలుగుచూసింది. చెత్త కుప్పల దగ్గర సంవత్సరాలుగా నివసిస్తున్న ఓ యాచకురాలి దగ్గర లక్షల రూపాయల నగదు బయటపడటంతో ప్రాంతమంతా కలకలం రేగింది. సమాచారం ప్రకారం, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళ గత 13 ఏళ్లుగా నగరంలోని ఒక వీధి మూలలో చెత్త కుప్పల మధ్యే జీవిస్తోంది. స్థానికులు ఆమెను సురక్షిత...