manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 2:59 pm Editor : manabharath

తాండూర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్‌

తాండూర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్‌ ఫర్ యూనిటీ – జాతీయ ఐక్యతకు ప్రజల స్పందన

మన భారత్, మంచిర్యాల జిల్లా – తాండూర్:
సర్ధార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తాండూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం “2కే రన్‌ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా జరిగింది. సిఐ దేవయ్య జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించారు. మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌ నుండి ఐబీ చౌరస్తా వరకు ఉత్సాహంగా ఈ పరుగుపందెం కొనసాగింది.

ఈ సందర్భంగా సిఐ దేవయ్య మాట్లాడుతూ, “దేశ సమైక్యతకు సర్ధార్ పటేల్ చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఆలోచనలను మనం ఆచరణలో పెట్టాలి. కుల, మత, వర్గ విభేదాలను విడనాడి జాతీయ ఐక్యతను చాటుకోవాలి” అని పిలుపునిచ్చారు.

రన్‌లో తాండూర్, మాదారం ఎస్ఐలు కిరణ్ కుమార్, సౌజన్య, స్థానిక నాయకులు, యువకులు, వాటర్స్ సభ్యులు, పోలీసులు మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యత, శాంతి, సామరస్యానికి ప్రతీకగా నినాదాలు ఇవ్వడం ద్వారా దేశభక్తి ఉత్సాహం నెలకొంది.

ఈ కార్యక్రమం ద్వారా తాండూర్ పోలీస్ శాఖ ప్రజల్లో జాతీయ ఏకత్వం, సామాజిక ఐక్యత, దేశభక్తి భావాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.