భారీ వర్షాలకు మునిగిన పంటలు
మన భారత్, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ అకస్మాత్తు వర్షాలతో పంట పొలాలు నీట మునిగిపోవడంతో పాటు కోతకు సిద్ధమైన వరి ధాన్యం దెబ్బతింటుందేమోనన్న భయంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతకు సమయం వచ్చిన ఈ దశలో వర్షం కారణంగా అనేకమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు కోసిన ధాన్యాన్ని...