manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 10:09 pm Editor : Editor Vishal Kumar

🐒 కోతుల బెడద.. గ్రామస్తుల ఆవేదన

మన భారత్ ,మెదక్: వెల్దుర్తి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కారణం – కోతుల బెడద! గత సంవత్సరం నుంచి వందలాది కోతులు గ్రామాలపై దండయాత్ర చేస్తూ స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్ల పైకప్పులపై తిరుగుతూ వస్తువులను ధ్వంసం చేస్తున్న కోతులు, ఇప్పుడు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, దొరికిన వస్తువులు ఎత్తుకెళ్తున్నాయి. గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ, “పిల్లలు బయట ఆడుకోవాలంటే భయపడుతున్నారు, పెద్దవాళ్లు బయటకు వెళ్తే దాడులు చేస్తున్నాయి. ఇంట్లో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం” అంటూ వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కోతులు ఇళ్లపైకప్పులను తొలగించి లోపలికి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. ప్రజలు పలుమార్లు పంచాయతీ, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. “అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది” అని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

అధికారులకు ప్రజల విజ్ఞప్తి: గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు వెంటనే అటవీశాఖ, స్థానిక మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అలాగే కోతుల బంధనానికి ప్రత్యేక బృందాన్ని నియమించాలని డిమాండ్‌ చేశారు. సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.