రెడ్ అలెర్ట్.. ఆదేశాలు జారీ చేసిన సీఎం
మన భారత్, హైదరాబాద్: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన క్యాంప్ఆఫీస్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్అండ్బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత, వరద పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. సీఎం మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని, అక్కడ రక్షణ చర్యలు వేగవంతం...