manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 8:33 pm Editor : manabharath

కల్తీ డీజిల్ తో ఘరానా మోసం..

హనదారులను మోసం చేస్తున్న పెట్రోల్ బంక్ యాజమాన్యం

మన భారత్, నారాయణపేట: మరికల్ మండలం బెల్కటూర్ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ ను విక్రయిస్తూ ఘరానా మోసం చేస్తున్నారని వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ డీజిల్ విక్రయించడంతో తమ వాహనాలు మరమ్మతులకు గురై తెల్లటి పొగ వచ్చి ఆగిపోతున్నాయన్నారు.ఈ విషయాన్ని పెట్రోల్‌ బంక్‌ యాజమానికి చరవాణి ద్వారా జరిగిన మోసాన్ని తెలియజేస్తే డబాయిస్తున్నారని వాపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 26వ తేదీన ఆదివారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా కేటి.దొడ్డి మండలానికి చెందిన కారు యజమాని ఆత్మకూరు వెళ్ళే రోడ్డు మార్గంలో భారత్ పెట్రోలియం బెల్కటూర్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంకులో పది లీటర్ల డీజిల్ కొట్టించుకున్నాడు. మార్గ మధ్యలోనే కారు మోరాయించడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తీరా చూస్తే డీజిల్ లో నీళ్లు కలిశాయని మెకానిక్ తెలిపగా బంక్ యాజమానిని చరవాణి ద్వారా నిలదీయడంతో బంక్ యజమాని తిరిగి బాధితులనే దబాయిస్తూ పెట్రోల్ బంక్ లో జరిగే మోసాన్ని కప్పి పుచ్చుకుంటున్నాడని బాధితుడు సుభాష్ తెలిపారు. ఈ విషయంపై బుధవారం నారాయణపేట జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చేసి పెట్రోల్ బంక్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.