108 వాహనంలో ప్రసవించిన మహిళ .. మన భారత్ ఆదిలాబాద్: తాంసీ మండలంలోని గిరిగామ గ్రామానికి చెందిన యశోద బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే యశోదకు పురిటి నొప్పులు ముదిరిపోవడంతో అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది చాకచక్యంగా స్పందించి తల్లి, శిశువుకు అవసరమైన వైద్య సహాయం...
No.1 తెలుగు న్యూస్ డైలీ