108 వాహనంలో ప్రసవించిన మహిళ ..
మన భారత్ ఆదిలాబాద్: తాంసీ మండలంలోని గిరిగామ గ్రామానికి చెందిన యశోద బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే యశోదకు పురిటి నొప్పులు ముదిరిపోవడంతో అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది చాకచక్యంగా స్పందించి తల్లి, శిశువుకు అవసరమైన వైద్య సహాయం అందించారు. ఈ సంఘటనపై 108 ఈఎంటీ వంశీ మాట్లాడుతూ.. “మాకు సమాచారం అందగానే వెంటనే వెళ్లి రోగిని ఆస్పత్రికి తరలించాం. మార్గమధ్యంలోనే ప్రసవం జరగడంతో తల్లి, శిశువును సురక్షితంగా ప్రసవింపజేశాం” అని తెలిపారు. పైలట్ పోచ్చన్న మాట్లాడుతూ, “తల్లి, బిడ్డను మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి చేర్చాం. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు” అని తెలిపారు. ఈ ఘటనపై గ్రామస్థులు 108 సిబ్బందిని ప్రశంసిస్తూ వారి సేవాభావాన్ని కొనియాడారు.
మన భారత్ ప్రత్యేక ప్రతినిధి – ఆదిలాబాద్