Date of Publish : 29 October 2025, 2:16 amEditor : manabharath
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపు
మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ హోరెత్తిస్తోం సాంస్కృతిక శాఖా మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, పాలమూరు ఎంపీ డీకే అరుణ, బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోంది. ప్రజల కష్టాలు పట్టించుకోని ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది” అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు తమ మధ్యలో ఉండి, కష్టసుఖాలు పంచుకునే వ్యక్తి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు, ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన ₹2,500 ఆర్థిక సాయం నిలిపివేసింది. నిరుద్యోగ భృతి, ఉద్యోగుల పీఆర్‌సీ పెంపు, రైతు హామీలు అన్నీ వాయిదాలకే పరిమితమయ్యాయి” అని విమర్శించారు. ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఎన్నో వాగ్దానాలు చేసి, వాటిని తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది” అని పిలుపునిచ్చారు. ప్రచారంలో బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, బండారు విజయలక్ష్మి, ఇస్నాతి శ్రీనివాస్, విజయ్ బాస్కర్, మోహన్ సింగ్, మిద్దె గణేష్, సుదీర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఇంటింటికి వెళ్లి బీజేపీ తరపున ఓటు వేయాలని కోరుతూ నాయకులు ప్రజలను ఆకట్టుకున్నారు.