గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తాం – మల్లెపూల నర్సయ్య
గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 28 : ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య మంగళవారం నేరడిగొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని రిజిస్టర్లను పరిశీలించి, ప్రతిరోజూ ఎంతమంది పాఠకులు వస్తున్నారో, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలను గ్రంథాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తన దృష్టికి తీసుకురావాలని...