మైనారిటీలను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్
బుల్డోజర్ రాజ్యం తెలంగాణలో నడుస్తోంది రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు? హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణలో మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ మోసపూరితమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. శంషాబాద్‌లో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్ మైనారిటీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ – “మైనార్టీల కోసం రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, చివరికి ఒక్క రూపాయినీ...