రూ.1.25 లక్షల మార్కు చేరిన మేలిమి బంగారం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం రికార్డు స్థాయిని తాకిన తర్వాత, ప్రస్తుతం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,610కు పెరిగింది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,15,140గా, 18 క్యారెట్ బంగారం ధర రూ.94,210గా నమోదైంది.
వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర దేశంలోని ప్రధాన నగరాల్లో రూ.1,54,900 నుండి రూ.1,69,900 మధ్య కొనసాగుతోంది. హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,69,900గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణెల్లో రూ.1,54,900గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
| నగరం | 24 క్యారెట్ | 22 క్యారెట్ | 18 క్యారెట్ |
|---|---|---|---|
| ఢిల్లీ | ₹1,25,760 | ₹1,15,290 | ₹94,360 |
| ముంబై | ₹1,25,610 | ₹1,15,140 | ₹94,210 |
| హైదరాబాద్ | ₹1,25,610 | ₹1,15,140 | ₹94,210 |
| చెన్నై | ₹1,25,440 | ₹1,14,990 | ₹96,240 |
| కోల్‌కతా | ₹1,25,610 | ₹1,15,140 | ₹94,210 |
| బెంగళూరు | ₹1,25,610 | ₹1,15,140 | ₹94,210 |
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు):
| నగరం | వెండి ధర |
|---|---|
| హైదరాబాద్ | ₹1,69,900 |
| చెన్నై | ₹1,69,900 |
| ముంబై | ₹1,54,900 |
| ఢిల్లీ | ₹1,54,900 |
| బెంగళూరు | ₹1,56,900 |
| కోల్‌కతా | ₹1,54,900 |
మార్కెట్‌పై ప్రభావం చూపుతున్న అంశాలు
అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై రేపు మొదలయ్యే సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు తాత్కాలికంగా నిలకడగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిపుణుల అంచనా..ఈ వారం చివరినాటికి బంగారం, వెండి ధరల్లో స్వల్ప పతనం నమోదయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత లేదా జియోపాలిటికల్ పరిణామాలు చోటుచేసుకుంటే పసిడి ధరలు మళ్లీ ఎగిసే అవకాశముందని పేర్కొన్నారు.
🔸 గమనిక: పై ధరలు వార్త రాస్తున్న సమయానికి ఉన్నవి మాత్రమే. మార్కెట్ పరిస్థితుల మేరకు బంగారం, వెండి రేట్లు రోజువారీగా మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు ముందు తాజా ధరలు తప్పనిసరిగా పరిశీలించాలి.
— మన భారత్ , స్టేట్ బ్యూరో