manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 11:59 pm Editor : manabharath

మొంథా తుఫాన్‌పై సీఎం రేవంత్ అప్రమత్తం

 ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి అని అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్‌: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారులకు అప్రమత్తంగా ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లను సజావుగా కొనసాగించేలా తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రభావం రాకుండా గిడ్డంగులు, తార్పాలిన్ షీట్లు, ఎండబెట్టే స్థలాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. రైతుల ధాన్యం, పత్తి పంటలు వర్షం వల్ల నష్టపోకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కార్యకలాపాల పురోగతి, తుఫాన్‌ చర్యలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడే దిశగా అన్ని శాఖలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

— మన భారత్ న్యూస్