manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 11:51 pm Editor : manabharath

పత్తి రైతులకు మంత్రి సూచన..

తేమ శాతం 12% మించకూడదని మంత్రి తుమ్మల సూచన
హైదరాబాద్‌: పత్తి పంటను విక్రయించే సమయంలో రైతులు తేమ శాతంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి పంటను మార్కెట్ యార్డులు లేదా జిన్నింగ్ మిల్లులకు తీసుకురావడానికి ముందు తేమ శాతం 12 శాతం మించకుండా చూడాలని ఆయన సూచించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “పత్తి తేమ శాతం అధికంగా ఉంటే రైతులకు కనీస మద్దతు ధర (MSP) లభించే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి పత్తి పంటను బాగా ఆరబెట్టిన తర్వాతే విక్రయించాలి” అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తిలో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని గుర్తించిన మంత్రి తుమ్మల, రైతులకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉన్నా పత్తి కొనుగోలు కొనసాగించేలా కేంద్రాన్ని అభ్యర్థించినట్టు చెప్పారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. అదే సమయంలో రైతులు కూడా పత్తి పంట నాణ్యతపై దృష్టి సారించి, సకాలంలో మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు.

మన భారత్ న్యూస్