manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 7:06 am Editor : manabharath

ఆటో కార్మికుల బాధలు విన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్

రెహమత్ నగర్‌లో ఆటోలో ప్రయాణించి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

మన భారత్, హైదరాబాద్: ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా ఆటోలో ప్రయాణించి కార్మికులతో చర్చించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్‌లోని కార్మిక నగర్ ఆటో స్టాండ్‌ వద్ద ఆటో డ్రైవర్లతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆటో కార్మికులు నగరంలో ఎదుర్కొంటున్న ఇంధన ధరల భారము, పెరిగిన ఛార్జీలపై ప్రజల అసంతృప్తి, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ స్థలాల కొరత వంటి అంశాలపై వారికి తగిన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆటో డ్రైవర్లు తమ సమస్యలను వివరించగా, ఎమ్మెల్యే వాటిని శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు కనుగొంటామని హామీ ఇచ్చారు. ఆటోలో ప్రయాణించి సాధారణ కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకోవడం పట్ల స్థానికులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.