manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 4:00 pm Editor : manabharath

జూబ్లీహిల్స్ లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రహమత్‌నగర్‌లో ప్రచారం చేపట్టిన ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య

మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారం వేగం పెరిగింది. ఈ క్రమంలో నారాయణపేట జిల్లా ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్య ఆదివారం రహమత్‌నగర్ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజా మద్దతును కోరుతూ నిర్వహించిన ఈ ప్రచారంలో గొల్ల కృష్ణయ్య మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. సామాన్యుడి జీవితంలో మార్పు తెచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే” అని అన్నారు. రహమత్‌నగర్ కాలనీలో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటించారని ఆయన తెలిపారు.గొల్ల కృష్ణయ్య ప్రచారంతో రహమత్‌నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రాంతమంతా కాంగ్రెస్ నినాదాలతో మార్మోగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో నారాయణపేట అసెంబ్లీ జనరల్ సెక్రటరీ అందులపు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మరికల్ మండల యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వి. అంజి రెడ్డి పటేల్, కాంగ్రెస్ నాయకులు బొంత మొగిలి, ఎలిగండ్ల చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు.