విద్యానిధికి టీజీవో రూ.7.50 లక్షల విరాళం
మహబూబ్నగర్ విద్యానిధికి టీజీవో రూ.7.50 లక్షల విరాళం — ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో చెక్కు అందజేత మన భారత్, మహబూబ్నగర్: విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన మహబూబ్నగర్ విద్యానిధికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రూ.7.50 లక్షల విరాళం అందజేసింది. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ విరాళం చెక్కును జిల్లా కలెక్టర్ విజయేందిరబోయికి అందజేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....