manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 12:36 pm Editor : manabharath

హెల్మెట్ వెంటే నిర్లక్ష్యం..

హెల్మెట్ వెంటే నిర్లక్ష్యం.. బండికి తగిలించుకుని ప్రయాణం
మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని పొన్నారి గ్రామ శివారులో ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్య ప్రవర్తన మరోసారి బయటపడింది. స్థానిక రహదారిపై ఓ బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు హెల్మెట్‌ను తలకు ధరించకుండా బండికి తగిలించుకుని వెళ్తున్న దృశ్యాలు మన భారత్ కెమెరాలో చిక్కాయి.రోడ్డు భద్రతా నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కానీ ఇంకా చాలా మంది వాహనదారులు ఈ నిబంధనను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదిలాబాద్తాంసి, పొన్నారి ప్రధాన రోడ్డుపై తీసిన ఈ ఫోటో రోడ్ భద్రత పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పోలీసులు తరచుగా జరిమానాలు విధిస్తూ, హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నా కూడా, కొందరు మాత్రం హెల్మెట్‌ను చేతిలో లేదా బండికి తగిలించుకుని వెళ్ళడం సాధారణంగా మారింది. “ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఎదురవుతుందో చెప్పలేం. హెల్మెట్ తలకు రక్షణగా ఉంటుంది. భద్రత కోసం అది తప్పనిసరిగా ధరించాలి” అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ – “హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిని చూసి భయం వేస్తుంది. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నిపుణులు సూచనల ప్రకారం ప్రతి ద్విచక్ర వాహనదారులు, వెనుక ప్రయాణికుడు కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ఇది చట్టపరమైన కర్తవ్యమే కాకుండా ప్రాణ భద్రతకు రక్షణగా నిలుస్తుంది.