మన భారత్, ఆదిలాబాద్ : ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా ప్రతి ఏడాది నిర్వహించే దండారి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని లీంగూడ, అంబుగాం గ్రామాల్లో అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాంసి మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామస్తులు తాండూరి డోలు వాయిద్యాలతో వారిని ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు.
ఉత్సవాల్లో గుస్సాడి వేషధారణలో యువకులు చేసిన నృత్యాలు, తాండూరి పాటలు, జానపద ప్రదర్శనలు స్థానికులను ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు ఆచారసాంప్రదాయాల మధ్య ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రత్న ప్రకాష్ మాట్లాడుతూ, “దండారి ఉత్సవాలు మన ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింబం. ఈ సంప్రదాయాన్ని తరతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది” అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
