manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 4:20 pm Editor : Admin

శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ గణేశాయ నమః 

శ్రీ మహాలక్ష్మియే నమః 

ఆదివారం, అక్టోబరు 19, 2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం – శరదృతువు, ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం,
తిథి : త్రయోదశి మ1.37 వరకు, వారం : ఆదివారం (భానువాసరే), నక్షత్రం : ఉత్తర సా6.35 వరకు, యోగం : ఐంద్రం తె3.33 వరకు, కరణం : వణిజ మ1.37 వరకు, తదుపరి భద్ర రా2.08 వరకు, వర్జ్యం : తె3.33 – 5.16, దుర్ముహూర్తము: సా4.00 – 4.47,
అమృతకాలం : ఉ11.01 – 12.42, రాహుకాలం : సా4.30 – 6.00, యమగండ/కేతుకాలం : మ12.00 – 1.30, సూర్యరాశి: తుల || చంద్రరాశి: తుల, సూర్యోదయం: 5.56 || సూర్యాస్తమయం:
5.35, 👉 శ్రీధన్వంతరి జయంతి, ధనత్రయోదశి & మాస శివరాత్రి.

శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
తాంసి, అక్టోబర్ 18 : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ధన్వంతరి జయంతి, ధన త్రయోదశి పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మంత్రోచ్ఛారణల మధ్య అర్చనలు, హారతులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు దీపాల కాంతులతో అలంకరించబడి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళా భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించుకుని కుటుంబ సౌఖ్యంతో పాటు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు.

ధన్వంతరి జయంతి సందర్భంగా ఆరోగ్య దేవుడైన శ్రీ ధన్వంతరిని ప్రత్యేకంగా పూజించడం విశేషం. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్నాజి నర్సింగ్ చారి, గ్రామ యువకులు చురుకుగా సహకరించారు.