వృద్ధ, చేనేత కార్మికులకు కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేయాలి
– ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ విజ్ఞప్తి
జగిత్యాల, నవంబర్ 29, మన భారత్ :
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అర్హులైన వృద్ధ చేనేత కార్మికులకు కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ స్థానిక ఎమ్మెల్యేకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. వయోభారం, అనారోగ్యం కారణంగా చేనేత వృత్తిని కొనసాగించలేక, ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధ చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అందజేసిన వినతిపత్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తరతరాలుగా చేనేత వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న పద్మశాలి కుటుంబాలు ప్రస్తుతం అనేక ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ముడిసరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటం, నేసిన వస్త్రాలకు తగిన గిట్టుబాటు ధరలు లభించకపోవడం, మార్కెట్లో పోటీ పెరగడం వంటి కారణాలతో చేనేత వృత్తి కష్టతరంగా మారిందని తెలిపారు. దీంతో అనేక కుటుంబాలు జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముఖ్యంగా వయస్సు పైబడిన చేనేత కార్మికులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మగ్గం నేయలేని పరిస్థితిలో ఉన్నారని, వృత్తి చేయలేకపోవడంతో వారికి ఎలాంటి ఆదాయం లేక కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో వారి జీవనం మరింత కష్టంగా మారిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం పేదలు, మహిళలు, వృద్ధులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో, చేనేత వృత్తిపై ఆధారపడి జీవించి ప్రస్తుతం వయోభారం వల్ల పని చేయలేని స్థితిలో ఉన్న అర్హులైన కార్మికులను కూడా చేయూత పెన్షన్ పథకంలో భాగస్వాములను చేయాలని కోరారు.
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో అర్హులైన చేనేత కార్మికులను గుర్తించి, వారికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబందించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసి పెన్షన్ ల పక్రియ వేగవంతం చేయాలనీ చూచించారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చూపుతున్న ప్రత్యేక చొరవను ఈ సందర్భంగా అడువాల జ్యోతి లక్ష్మణ్ అభినందించారు. పేదలు, బలహీన వర్గాలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వ పరంగా మరింత అండదండలు అందించాలని కోరారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్ అందజేసిన వినతిపత్రంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని, సంబంధిత అధికారులకు ఆదేశాల జారీ చేశారు.
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో అర్హులైన చేనేత కార్మికులను గుర్తించి, వారికి కొత్తగా చేయూత పెన్షన్లు మంజూరు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంజూరు పక్రియ వేగవంతం చేయాలనీ సూచన చేశారు .. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరైతే వారి కుటుంబాలకు ఎంతో ఆర్థిక భరోసా లభిస్తుందని అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు చేనేత కార్మికుల తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్, స్టాండింగ్ కమిటీ మున్సిపల్ మహేందర్ , జిల్లా పద్మశాలి సేవా సంఘం కార్యదర్శి వీరబత్తిని శ్రీనివాస్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు బోగ గంగాధ, కోశాధికారి ప్రభాకర్, , మాజీ కౌన్సిలర్ అల్లే సాగర్, , అడవాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
