manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 2:55 pm Editor : user5442714

రత్నపూర్ రోడ్డు పనులు ప్రారంభం..

రత్నపూర్ గ్రామంలో రోడ్డు పనులు ప్రారంభం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు.. సహకరించిన గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సర్పంచ్ ఆత్రం సులోచన కృతజ్ఞతలు

మన భారత్, తలమడుగు:నవంబర్ 29,

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రత్నపూర్ గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. గ్రామంలో రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా చేపట్టిన ఈ పనులతో గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు పడిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు పనుల ప్రారంభానికి సహకరించిన గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులకు గ్రామ సర్పంచ్ ఆత్రం సులోచన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ సమన్వయంతో ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఎం. నాగోరావు (పటేల్), పి. ప్రసాద్ (మహాజన్), ఏ. కోసేరావు (గట్యాల్), కె. తెలంగారావు (డేవరీ), పి. రాంభాయి (మాజీ సర్పంచ్), కోవా మున్నాబాయి (ఉప సర్పంచ్) తదితరులు రోడ్డు పనుల ప్రారంభానికి సహకరించిన వారిలో ఉన్నారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సర్పంచ్ ఆత్రం సులోచన, నరేష్ కుమార్ తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో రత్నపూర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్



(adsbygoogle = window.adsbygoogle || []).push({});