manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 2:51 pm Editor : user5442714

రాష్ట్ర గవర్నర్ పర్యటన.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు

రాష్ట్ర గవర్నర్ గారి పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు
– జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
– 380 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు
జగిత్యాల, నవంబర్ 29, మన భారత్ :
రాష్ట్ర గవర్నర్ శివ్‌ ప్రతాప్ శుక్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా 380 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జేఎన్టియూలో ఏర్పాటు చేసిన బందోబస్తు బ్రీఫింగ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని, సంబంధిత అధికారులు, పోలీస్ సిబ్బందికి పూర్తి వివరాలతో బ్రీఫింగ్ నిర్వహించారు. పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను అత్యంత అప్రమత్తతతో నిర్వర్తించాలని సూచించారు.పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రదేశాలు, హెలిప్యాడ్ ప్రాంతాలు, కీలక కూడళ్ల వద్ద భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సవివరంగా వివరించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు. వీఐపీ వెళ్ళే మార్గాలలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.ప్రతి అధికారి బందోబస్తు కేటాయించిన ప్రాంతం పై పూర్తి అవగాహన మరియు చేయవలసినటువంటి డ్యూటీ గురించి పూర్తిగా తెలిసి ఉండాలని అన్నారు.ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్ర గవర్నర్ పర్యటనను ప్రశాంతంగా, సజావుగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి , ట్రైనీ డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు,పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});