manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 12:13 pm Editor : user5442714

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పోస్టర్ ఆవిష్కరణ

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం..ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పోస్టర్ ఆవిష్కరణ
జగిత్యాల, నవంబర్ 29, మన భారత్ :
జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన సింగారపు శ్యామల – రాజకుమార్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్యామల గారికి చీరను కానుకగా అందజేశారు. అనంతరం చల్గల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో భాగంగా గ్రామంలోని 2038 కుటుంబాలకు బీమా కల్పించిన సందర్భంగా రూపొందించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణంతో పాటు ఆర్థిక భద్రత కల్పించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చల్గల్ గ్రామంలో వందశాతం గీతా కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నామని, అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం అని,చేయూత పెన్షన్లు నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో గుడిసెలో ఉన్న వారికి అత్యంత ప్రాధాన్యత అని అన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి 5500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. జగిత్యాల పట్టణంలో 4500 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ చేయగా గ్రామాల్లో అత్యధిక ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం జరిగింది. అధికారుల తప్పిదంతో ఎల్3లో అర్హుల పేర్లు రావడం తో కొంత ఇబ్బంది ఉండగా వారికి త్వరలో కేటాయిస్తాం అని అన్నారు. 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం తో పేద పిల్లలకు మెరుగైన విద్య సదుపాయాలు. గీత నేత పైలేరియా వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు పంపిణీ చేయటం తో ఆర్థిక భరోసా కల్పించడం జరిగింది. ఇందిరమ్మ కుటుంబ బీమాతో కుటుంబానికి కొండంత అండ అని, ముఖ్యమంత్రి కోటి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నారు అని అన్నారు. రైతులకు రైతు బీమా 5 లక్షలు అమలు చేయగా భూమిలేని బీద మధ్యతరగతి ప్రజల కు ఇందిరమ్మ జీవిత బీమా పథకం గొప్ప నిర్ణయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గజంగి నందయ్య పాక్స్ చైర్మెన్ కొలుగూరి దామోదర్ రావు ఏఎంసి వైస్ చైర్మన్ అబ్బూరి మల్లేశం గౌడ్, డైరెక్టర్ గడ్డం గంగారెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పులిశెట్టి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ తిరుపతి నలువల సురేష్, దాసరి సతీష్, వార్డు సభ్యులు నరేష్, అక్రమ్, కోల స్వామి, లక్ష్మణ్, శేఖర్, నవీన్, మజీద్, వివిధ సంఘ కుల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});