సాగునీటి వివక్షత హరీష్ రావు, కేటీఆర్ తో చర్చకు సిద్ధం
– రోళ్ళవాగు అక్కపల్లి లిఫ్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయి..?*
– పత్తిపాక రిజర్వాయర్ పనులు ఎందుకు ప్రారంభించలేదు..
– ఎల్లంపల్లి నిర్వాసితులకు ఎందుకు పరిహారం ఇప్పించలే..?
– కొప్పుల ఈశ్వర్ నిర్ణయాలతో ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కష్టాలు
– మాజీ మంత్రి కొప్పులపై మండిపడ్డ మంత్రి లక్ష్మణ్ కుమార్
– కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధికి కేరాఫ్ గా ధర్మపురి
– ధర్మపురిలో మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
జగిత్యాల/ధర్మపురి, నవంబర్ 29, మన భారత్ :
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, రావు కేటీఆర్ లతో చర్చకు సిద్ధమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దమ్ముంటే ముగ్గురు నాయకులతో కాళేశ్వరం జలాల విషయంలో ధర్మపురి నియోజకవర్గానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జరిగిన అన్యాయంపై చర్చకు తేదీ స్థలం ఖరారు చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సవాలు విసిరారు.
ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల వల్ల సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని పై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ గా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ధర్మపురి ప్రజలు 2023 ఎన్నికల్లో ఓడించిన, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కొప్పుల ఈశ్వర్ నేటికీ అహంభావంతో మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి మండిపడ్డారు.
దళిత సామాజిక వర్గం నుండి వచ్చి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత ఎమ్మెల్యేగా ఎన్నుకొని మంత్రిగా పనిచేస్తున్న తనపై అహంకారం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లాల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అచ్చంపేట సభలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తే కృష్ణా జలాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగినట్లు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై తాను స్పందించి బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటిని కేటాయించలేదని దీనిపై చర్చకు సిద్ధమని హరీష్ రావు ను ప్రశ్నిస్తే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.
ధర్మపురి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని రిజర్వాయర్ కు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రిజర్వాయర్ గా నామకరణం చేస్తామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఎందుకు పనులు ప్రారంభించలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. దీనికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. 2014లో ప్రతిపాదించిన రోడ్ల వాగు ప్రాజెక్టు 2016 వరకు ఎందుకు పనులు ప్రారంభించలేదని, రూ. 60.24 కోట్లతో ప్రారంభించిన రోళ్ల వాగు ప్రాజెక్టు అంచనాలు రూ. 136 కోట్లకు చేరిన ఎందుకు పూర్తి కాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.
అక్క పళ్లి లిఫ్ట్, స్తంభంపల్లి లిఫ్ట్ పనులు ఎందుకు పూర్తి కాలేదో మాజీ మంత్రి సమాధానం చెప్పాలని లక్ష్మణ్ కుమార్ అన్నారు. రోళ్ళ వాగు ప్రాజెక్టుతో ప్రారంభించిన రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ పనులు పూర్తి అయితే ఆనాడు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ఎందుకు ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. నంది మేడారం రిజర్వాయర్ నుండి కొత్తపేట సాగునీటిని అందించే కాలువ పనులు అంచనాలను తయారు చేసి కనీసం నిధులు కేటాయించలేని అసమర్ధ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ పేరు తెచ్చుకున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రోళ్ల వాగు ప్రాజెక్టుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అడవి శాఖ అనుమతులు సాధించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 25 లక్షలు చెల్లించి అటవీశాఖ, పర్యావరణ అనుమతులు సాధించి రోళ్ళవాగు కు గేట్లు బిగించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదా.. ఇందులో మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవ లేదా అని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం సాగవుతున్న భూములు కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో నిర్మించిన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, ఎల్ఎండి, వరద కాలువ వంటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీటితో వరి సాగు చేస్తున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి రత్నాకర్ రావు ఆలోచనతో ఏర్పాటు చేసిన లిఫ్టుల ద్వారా ధర్మపురి మండల రైతులకు సాగునీరు అందుతుందని మంత్రి గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో గోదావరి ఎండిపోయి ధర్మపురి రైతులు ఇబ్బందులు పడుతుంటే గౌరవ ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో శ్రీరాంసాగర్ గేట్లు ఎత్తించి పంటలు కాపాడిన ఘనత తనకే దక్కుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో గోదావరిపై ఉన్న లిఫ్టుల మోటర్లు కాలిపోతే వారి బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెడితే తాను ఎమ్మెల్యే అయిన తర్వాత కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించానీని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాగితాలకు పరిమితమైన అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 60 శాతం పూర్తి చేశామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నియోజకవర్గ సాగునీటి సమస్యలు పరిష్కరించడానికి జంగల్ నాలా ప్రాజెక్టు డీపీ ఆర్ పూర్తి చేసి రంగధాముని పల్లి చెరువు అభివృద్ధి చేసి చిల్వకోడూరు చెరువు నుండి జంగల్ నాలా ప్రాజెక్టు వరకు సాగునీటిని తీసుకువచ్చి ధర్మపురి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రణాళికలు తయారు చేశామని మంత్రి తెలిపారు.
నిర్వాసితులకు అండగా..
ధర్మపురి నియోజకవర్గంలోని భూనిర్వాసితులకు తాను అండగా నిలిచానని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ చెగ్యాం నిర్వాసితులకు పరిహారం చెల్లించకుంటే తాను రూ. 17 కోట్ల పరిహారం ఇప్పించామని మంత్రి గుర్తు చేశారు. మేడారం రిజర్వాయర్ తో చామనపల్లి గ్రామం ముంపుగురి అయితే నాడు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ నిర్వాసితులను పట్టించుకోకుంటే తాను మంత్రి అయిన తర్వాత చామనపల్లి గ్రామాన్ని 100% ముంపు గ్రామంలో తీసుకొని రూ. 350 కోట్ల పరిహారం చెల్లించడానికి జీవో విడుదల చేశామని మంత్రి గుర్తు చేశారు. వెల్గటూర్ మండల కేంద్రంలో 3వేల మంది వడ్డెర కులస్తుల పుట్టగొట్టింది ఎవరో ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు తెలుసని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాయ కష్టం చేసుకొని బతికే వడ్డెర కులస్తులను బెదిరించి గుట్టను పెద్దలకు అప్పజెప్పిన ఘనత కొప్పుల ఈశ్వర్ కు దక్కిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
అభివృద్ధికి కేరాఫ్
ధర్మపురి నియోజకవర్గ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి కేరాఫ్ గా మారిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ధర్మపురిలో మూతపడిన నైట్ కళాశాలను తెరిపించడంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించానని ధర్మారంలో ఐటిఐ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని ధర్మపురి మండలం నేరెళ్లలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందని ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిచే బస్ డిపో నిర్మాణానికి ప్రకటన చేయించామని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు. గోదావరి పుష్కరాలకు రూ. 226 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. వివిధ శాఖల ద్వారా నియోజకవర్గంలో సుమారు వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. సంక్షేమ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసిన కొప్పుల ఈశ్వర్ హాస్టల్స్ అద్దె బిల్లులు చెల్లించకుండా పోతే తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హాస్టల్స్ అద్దె బిల్లులు చెల్లించానని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటిలో జరిగిన అన్యాయంపై చర్చించడానికి తనతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ లను చర్చకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ మండల పార్టీ అధ్యక్షులు గ్రామ సర్పంచులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
