manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 10:48 am Editor : user5442714

గిర్నూర్‌లో రాత్రి బస.. ఉదయం గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆడే గజేందర్ గ్రామస్తులు మహిళలు యువతతో ముఖాముఖి.. మౌలిక వసతుల సమస్యలపై ఆరా

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. గ్రామాల్లో పల్లె నిద్రతో ప్రజలకు చేరువ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

గిర్నూర్‌లో రాత్రి బస.. ఉదయం గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆడే గజేందర్
గ్రామస్తులు, మహిళలు, యువతతో ముఖాముఖి.. మౌలిక వసతుల సమస్యలపై ఆరా

మన భారత్, బజార్హత్నూర్: నవంబర్ 28,

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామంలో ఆయన రాత్రి బస చేశారు.

రాత్రి గ్రామంలోనే బస చేసిన ఆడే గజేందర్ మరుసటి రోజు ఉదయం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు, యువకులు, గ్రామ పెద్దలతో మాట్లాడి గ్రామంలో నెలకొన్న పరిస్థితులు, మౌలిక వసతుల కొరత, అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలపై వివరాలు సేకరించారు.

గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, స్థానికంగా పరిష్కరించాల్సిన సమస్యలను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆడే గజేందర్ హామీ ఇచ్చారు.

ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు గ్రామాలకు వెళ్లి ప్రజల మధ్య ఉండటం ద్వారా క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుందని, ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో పల్లె నిద్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});