manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 10:43 am Editor : user5442714

తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ చచ్చుదో..! -మొగుళ్లపల్లి మండల కేంద్రంలో గర్జించిన ఉద్యమకారులు.. కేసీఆర్ కు ఘనంగా పాలాభిషేకం..!

తెలంగాణ వచ్చుదో – కేసీఆర్ చచ్చుదో..!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

-మొగుళ్లపల్లి మండల కేంద్రంలో గర్జించిన ఉద్యమకారులు.. కేసీఆర్ కు ఘనంగా పాలాభిషేకం..!

మొగుళ్ళపల్లి: నవంబర్ 29, (మన భారత్):

తెలంగాణ చరిత్రలో మరపురాని రోజు,తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రోజు,నవంబర్ 29.
ఆ రోజునే తెలంగాణ తల్లి బిడ్డల ఆత్మగౌరవం కోసం, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు “తెలంగాణ వచ్చుదో – కేసీఆర్ చచ్చుదో”* అని ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు.ఆ ఒక్క దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రనే మార్చేసింది. నిద్రపోతున్న ఢిల్లీని కదిలించింది. కోట్లాది తెలంగాణ బిడ్డలను ఒక్క తాటిపైకి తెచ్చింది. విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు అందరూ రోడ్డెక్కారు. తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితిని సృష్టించింది.ఆ చారిత్రక దీక్షా దివస్ ను స్మరించుకుంటూ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద శనివారం దీక్షా దివస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు.మొగుళ్లపల్లి మండల జేఏసీ చైర్మన్ చదువు అన్నారెడ్డి, మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదని, ఆయన త్యాగం, పట్టుదల వల్లే ఈ రోజు మనం స్వరాష్ట్రంలో తలెత్తుకుని తిరుగుతున్నామని అన్నారు. కేసీఆర్ గారి దీక్షా స్ఫూర్తిని యువతరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొగుళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమల్ల రమేష్, చెక్క శ్రీధర్ ,దేవునూరి కుమార్, బొల్లెని రవికుమార్ ,పడిదల జగ్గారావు ,మల్సాని బాపురావు ,వనం కార్తీక్ ,పోల్సాని శీను, పడిదల తిరుపతిరావు, వనం రాజశేఖర్ , దేవునూరి నరేష్, చెక్క సురేష్, అరికాంతపు అన్నారెడ్డి , వనం రాజయ్య, వనం సారయ్య, అశోక్ ,పవన్ ,శ్రీను, రాజు కార్యకర్తలు ప్రజలు ,తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});