manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 3:10 am Editor : user5442714

జ్ఞాన జ్యోతి వెలిగించిన బూర శోభారాణి-చిర్ర రాజు గౌడ్ దంపతులకు శుభాకాంక్షల జల్లు!

జ్ఞాన జ్యోతి వెలిగించిన బూర శోభారాణి-చిర్ర రాజు గౌడ్ దంపతులకు శుభాకాంక్షల జల్లు!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభినందనల వెల్లువ!

శాలువాతో ఆత్మీయంగా సన్మానించిన వేముల మహేందర్ గౌడ్

మన భారత్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా:

కాకతీయ విశ్వవిద్యాలయ పీఠంపై, రాష్ట్ర గవర్నర్ వారి కరకమలాల ద్వారా విద్యా పట్టాభిషేకం (డాక్టరేట్) పొందిన డాక్టర్ బూర శోభారాణి-చిర్ర రాజు గౌడ్ దంపతులను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ శనివారం హన్మకొండలోని భీమారంలో గల వారి నివాసంలో అత్యంత ఆత్మీయంగా, ఘనంగా సన్మానించారు. ఈ శుభ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ మాట్లాడారు.”మన ఆడబిడ్డ శోభారాణి సాధించిన ఈ విజయం సామాన్యమైనది కాదు, ఇది అసామాన్యం, అద్భుతం. ఇది తెలుగు భాషా సాహిత్యానికే వన్నె తెచ్చిన ఘనత అని కొనియాడారు. ఎంఏలో రెండు స్వర్ణ పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించి, ప్రస్తుతం కమలాపూర్ లో తెలుగు విద్యా ప్రదాతగా సేవలందిస్తూనే, సరస్వతీ ఉపాసన చేసి డాక్టరేట్ సాధించడం అంటే మాటలు కాదు. ఇది విద్యా తపస్సు అన్నారు.ఈ తపస్సు వెనుక వారి భర్త చిర్ర రాజు గౌడ్ త్యాగం, ప్రోత్సాహం, సహధర్మం ఉన్నదని, అందుకే ఈ దంపతులు ఇద్దరూ ఆదర్శ దంపతులు, అన్యోన్య దంపతులుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారన్నారు. వారి ఈ విద్యా కృషి మన యువతకు, మన బీసీ బిడ్డలకు స్ఫూర్తిదాయకం, దిక్సూచి లాంటిదని, వారు విద్యా శిఖరాలను మరెన్నో అధిరోహించాలని, తెలుగు తల్లికి మరింత కీర్తి కిరీటం తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నానని హృదయపూర్వకంగా పేర్కొంటూ, ఆ పుణ్య దంపతులను శాలువాతో సత్కరించి, పుష్పమాలతో అభినందించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా అభినందనల వెల్లువతో, హర్షధ్వానాల మధ్య వారిని సత్కరించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, విద్యావేత్తలు, బంధుమిత్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});