manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 1:22 am Editor : user5442714

మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు..

మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మొగుళ్ళపల్లి: నవంబర్ 28, (మన భారత్):

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జాతీయ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఆ మహనీయుడు బాల్యంలో అనుభవించిన దుర్భర జీవితాన్ని గడిపి అగ్రకుల దేశంలో కరుడుగట్టిన కట్టుబాట్లను తీవ్రంగా వ్యతిరేకించి, వాటి నిర్మూలన కొరకు జీవితమంతా పరితపించాడని తెలిపారు. ఆయన దేశానికి ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకులు మంద సాంబయ్య, మొగుళ్లపల్లి గ్రామ కార్యదర్శి నరేష్, అంబేద్కర్ సీనియర్ నాయకులు కట్కూరి ఐలయ్య, అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షులు బొచ్చు నరసయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బండారి రాజు, కారోబార్ అబ్బు, తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});