manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 3:06 pm Editor : user5442714

అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించిన బోథ్ ఎమ్మెల్యే..

అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నెరడిగొండలోని నివాసంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఎమ్మెల్యే

మన భారత్, నేరడిగొండ:నవంబర్ 28,

నెరడిగొండలోని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో ఈరోజు అయ్యప్ప స్వాముల కోసం భిక్ష కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా అయ్యప్ప స్వాములకు భోజనం వడ్డించి వారి ఆతిథ్యంలో పాల్గొన్నారు.

అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన భక్తులకు భిక్ష అందించడం సంప్రదాయంగా వస్తోందని, స్వాములకు సేవ చేయడం ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ఎమ్మెల్యే స్వయంగా స్వాములకు వడ్డన చేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అయ్యప్ప స్వాముల పట్ల గౌరవం, భక్తిభావంతో నిర్వహించిన ఈ భిక్ష కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. భక్తులకు ఆతిథ్యం అందిస్తూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్న తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది.

మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, స్టాఫ్ రిపోర్టర్, ఆదిలాబాద్.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});