manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 3:25 pm Editor : user5442714

గ్రామాల్లో కరెంట్ కష్టాలకు చెక్ .. 5 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు!

గ్రామాల్లో కరెంట్ కష్టాలకు చెక్ – 5 కొత్త ట్రాన్స్ ఫార్మర్లు!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇస్సిపేటలో 2, మొట్లపల్లిలో 3 – గ్రామస్తుల విజ్ఞప్తితో అధికారుల చొరవ!

-ఓవర్ లోడ్ సమస్యకు పరిష్కారం – ఇకపై నిరంతర విద్యుత్ వెలుగులు!

మొగుళ్ళపల్లి: నవంబర్ 28,(మన భారత్):

గ్రామీణ ప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ పాలకవర్గం చేసిన విజ్ఞప్తి మేరకు విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, రెండు గ్రామాల్లో ఐదు నూతన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో రెండు 25కేవీఏ సామర్థ్యం గల లైటింగ్ ట్రాన్స్ ఫార్మర్లు, మొట్లపల్లి గ్రామంలో మూడు 25కేవీఏ సామర్థ్యం గల లైటింగ్ ట్రాన్స్ ఫార్మర్లు అమర్చారు. గత కొంతకాలంగా ఈ రెండు గ్రామాల్లో జనాభా పెరగడం, విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో పాత ట్రాన్స్ ఫార్మర్లపై ఓవర్ లోడ్ పడి తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో గృహాలకు, వ్యవసాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను గ్రామ సర్పంచ్ లు విద్యుత్ శాఖ దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు వెంటనే సానుకూలంగా స్పందించారు. ఓవర్ లోడ్ ను నివారించి, గ్రామాలకు నిరంతర విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ పాపిరెడ్డి, ఏడీఈ సుందర్ కుమార్, ఏఈ గుగులోతు నగేష్, లైన్ ఇన్స్పెక్టర్ లు దశరథం, శ్రీనివాస్ నాయక్, లైన్ మెన్ లు సత్యం, అనిల్, ఏ ఎల్ మ్ లు శ్రీనివాస్, మహిపాల్, శంకర్, మొట్లపల్లి ఇస్సిపేట గ్రామాల సర్పంచ్ లు నరహరి వెంకట్ రెడ్డి, యార ముకుంద రెడ్డి, ఉపసర్పంచ్ బత్తిని శ్రీధర్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కొత్త ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుతో ఇకపై తమ గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉండదని, లైట్లు, మోటార్లు సక్రమంగా పనిచేస్తాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి త్వరితగతిన స్పందించిన విద్యుత్ శాఖ అధికారులకు ఆయా గ్రామాల పాలకవర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 



(adsbygoogle = window.adsbygoogle || []).push({});