కొడిమ్యాలలో ఘనంగా 70వ జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభం
– ఆలోచనాశక్తి, ఏకాగ్రత పెంపొందించేందుకు చదరంగం దోహదం
– ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి
జగిత్యాల/కొడిమ్యాల, నవంబర్ 28, మన భారత్ :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో 70వ ఎస్జిఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 17 బాలబాలికల చదరంగం పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా విద్యాశాఖ ఏఎంఓ చంద్రశేఖర్ రెడ్డి చదరంగం బోర్డుపై పావులను కదిపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆలోచనాశక్తి, ఏకాగ్రత, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చదరంగం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్వహించే చదరంగం పోటీలను కొడిమ్యాల వంటి గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం అభినందనీయమన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించిన ఎస్జిఎఫ్ కొడిమ్యాల నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు యంగ్ ఇండియా నోడల్ ఆఫీసర్ వి. శ్రీనివాస్, ఎస్జిఎఫ్ జగిత్యాల జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి టి. చక్రధర్ రావు ట్రోఫీలు, మెడల్స్ మొదటి 5 స్థానాలు సాధించిన వారికి అందజేశారు. కొడిమ్యాల మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో ఎస్జిఎఫ్ కొడిమ్యాల మండల చైర్మన్ శ్రీనివాస్, మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఆర్గనైజర్ బూట్ల రాజమల్లయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచి విజేందిర, కరీంనగర్ ఎస్జిఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బన్సీలాల్, పెటా టిఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నవీన్, వి. సంపత్ కుమార్, తిరుపతి రెడ్డి, ప్రణీత, కళ్యాణ్, మోహన, రాజేంద్రప్రసాద్, సుమన్, దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్లు బీరయ్య, శివ కృష్ణ, గంగా జల, మల్లయ్య, శ్రీకాంత్, సత్యనారాయణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 4 జిల్లాలకు చెందిన 89 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
