సామాజిక న్యాయానికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే
సమానత్వం, విద్య, సామాజిక న్యాయానికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాలకు విద్యా వెలుగులు పంచిన సంఘ సంస్కర్త మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28, భారతదేశ సామాజిక చరిత్రలో మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సోగాల సుదర్శన్ పేర్కొన్నారు. కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలు, మహిళలపై సామాజిక ఆంక్షలకు వ్యతిరేకంగా తన జీవితాంతం...