రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత..
మన భారత్, భీంపూర్: భీంపూర్ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సాయంత్రం కాగానే మంచు కురుస్తూ చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ఉదయం వేళల్లో మంచు దట్టంగా కమ్ముకోవడంతో రాకపోకలకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.