manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 3:02 pm Editor : user5442714

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూమేష్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా అందజేత

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూమేష్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా అందజేత

మన భారత్, ఇంద్రవెల్లి:నవంబర్ 28,

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన డోంగర్గాం గ్రామానికి చెందిన పెందూర్ భూమేష్ కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మెస్రం దయాకర్ పటేల్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

వివరాల్లోకి వెళితే.. గత నెల అక్టోబర్ 30వ తేదీన పెందూర్ భూమేష్ (తండ్రి రాము) ఇంద్రవెల్లి నుంచి తన స్వగ్రామమైన డోంగర్గాం గ్రామానికి ఆటోలో ప్రయాణిస్తుండగా హర్కాపూర్ తండా వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భూమేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండో రోజు భూమేష్ మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ ప్రమాద విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తూ తనవంతు సహాయంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇందులో భాగంగా ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మెస్రం దయాకర్ పటేల్ డోంగర్గాం గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, పార్టీ తరఫున ప్రకటించిన రూ.లక్ష నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని తెలిపారు. ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాయం కొంతమేర ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముత్తునూరు సర్పంచ్ రీటే విటల్, టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గెడం భరత్, రాథోడ్ ప్రశాంత్, కస్లాపూర్ దేవారి, పెందూర్ జంగు బాబు, ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన కమిటీ రగల్ జెండా చైర్మన్ మెస్రం నాగనాథ్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క చిత్రు, ఉట్నూరు మండల టీఆర్ఎస్ నాయకులు జగన్, కుమ్ర రాము తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు, గ్రామ పెద్దలు, యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్
మన భారత్, స్టాఫ్ రిపోర్టర్, ఆదిలాబాద్.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});