manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 2:57 pm Editor : user5442714

పారిశ్రామికవేత్తలు రాజు చింతావార్ దిలీప్ చింతావార్‌కు ఘన సత్కారం

పారిశ్రామికవేత్తలు రాజు చింతావార్, దిలీప్ చింతావార్‌కు ఘన సత్కారం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28,

ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాజు చింతావార్, దిలీప్ చింతావార్‌లను సామాజిక కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. వారి నివాసానికి వెళ్లిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం వారిని ఆత్మీయంగా కలుసుకుని శాలువాలు కప్పి గౌరవించింది.

ఈ సందర్భంగా రాజు చింతావార్, దిలీప్ చింతావార్‌లతో పరస్పరం ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు సామాజిక సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ వివిధ వర్గాలతో సత్సంబంధాలు కొనసాగించడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ మర్యాదపూర్వక భేటీలో సామాజిక కార్యకర్తలు ముడుపు మౌనిష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్, నారాయణ్ రెడ్డి, శేషయ్య, నాగన్న, సాయికిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్, మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, ఆదిలాబాద్.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});