మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మౌనిష్ రెడ్డి, సహచరులు
మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 28,
ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన మృతుల కుటుంబాలను సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని జైజవాన్ నగర్ కాలనీకి చెందిన ఆడప నరేష్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ముడుపు మౌనిష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకుని ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.
అలాగే చించర్వాడ కాలనీకి చెందిన ఆకోజీ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులను, తీర్పెల్లి కాలనీకి చెందిన చెనిగారపు రాంకిష్టు కుటుంబ సభ్యులను సైతం పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి బాధలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్తలు ముడుపు మౌనిష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఆశన్న యాదవ్, శేషయ్య తదితరులు పాల్గొని బాధిత కుటుంబాలను పరామర్శించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్,మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, ఆదిలాబాద్.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
