manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 2:51 pm Editor : user5442714

మహాత్మ జ్యోతిరావు పూలే 136 వర్ధంతి వేడుకలు వేడుకలు..

సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మన భారత్, చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ జాతీయ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల పూలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే నవంబర్ 28 1890లో ప్లేగు వ్యాధితో మరణించాడని తెలిపారు . ఆ మహనీయుడు బాల్యంలో అనుభవించిన దుర్భర జీవితాన్ని గడిపి అగ్రకుల బ్రాహ్మణుల వివక్షతను ఆలోచనపరుడుగా మార్చాయన్నారు . 19వ శతాబ్దంలో చీకటి రోజుల్లో బ్రాహ్మణీయ కులతత్వపు కోరల్లో చిక్కి శల్యమై పోతున్న అణగారిన వర్గాలలో కుల నిర్మూలన దృక్పథాన్ని బోధించి అగ్రకుల దోపిడి వర్గానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలను సామాజిక విప్లవ దిశగా మేల్కొల్పిన తొలి సామాజిక విప్లవ చైతన్య స్ఫూర్తి మహాత్మ జ్యోతిరావు పూలే అన్నారు. ఈ దేశంలో స్త్రీ విద్యకు అంకురార్పణ చేసిన మొట్టమొదటి వ్యక్తి పూలే అని తెలిపారు. 1948లో స్త్రీలకు పాఠశాలను నెలకొల్పి తన భార్య సావిత్రిబాయి పూలేను దేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా పెట్టి అందరికీ విద్యానందించాడని అన్నారు . దేశంలో కరుడుగట్టిన కట్టుబాట్లను తీవ్రంగా వ్యతిరేకించి, వాటి నిర్మూలన కొరకు జీవితమంతా పరితపించాడని తెలిపారు. ఆయన దేశానికి ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.

సంఘం ఆవిర్భావ 50వ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కరపత్రాలు విడుదల
——————————————-
అనంతరం అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఆవిర్భావ 50వ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హైదరాబాదులోని రవీంద్రభారతిలో డిసెంబర్ 3న 50వ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అంబేద్కర్ వాదులు మేధావులు ఉద్యోగులు, శ్రేయోభిలాషులు వివిధ సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు కుల మతాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని కరపత్రాలను విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షులు దూధపాక సరోత్తం గుర్రపు అశోక్ మాదిగ జాగృతి సంగం జిల్లా కన్వీనర్ పర్లపెల్లి వంశీ అంబేద్కర్ యువజన సంఘంమండల నాయకులు అంబేద్కర్ వాదులు మేధావులు గురుకుంట్ల కిరణ్ పాము కుంట్ల చందర్ గడ్డం సదానందం మంగళపల్లి శ్రీనివాస్ ఉప్పుల కిరణ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});