manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 11:49 am Editor : user5442714

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..

వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
జగిత్యాల, నవంబర్ 28, మన భారత్ :
జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి విశేష సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా సమిండ్ల వాణి శ్రీనివాస్ గారి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రంతో దంపతులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలతో దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});