manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 11:55 am Editor : user5442714

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్
జగిత్యాల, నవంబర్ 28, మన భారత్ :
మెడికల్ కాలేజీ వెనుక డబుల్ రోడ్డు పనుల్లో భాగంగా బసవేశ్వర విగ్రహం వద్ద జంక్షన్ అభివృద్ధిపై పరిశీలన
జగిత్యాల పట్టణంలోని మెడికల్ కాలేజీ వెనుక చేపడుతున్న డబుల్ రోడ్డు పనుల్లో భాగంగా బసవేశ్వర విగ్రహం వద్ద జంక్షన్ అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బసవేశ్వర విగ్రహం చుట్టూ సర్కిల్ ఏర్పాటు చేసి, అందులో మొక్కలు నాటి గార్డెన్ తరహాలో సుందరంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. జంక్షన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో డిఈ కౌన్సిలర్ జుంబర్తీ గంగలక్ష్మి రాజ్ కుమార్, ప్రశాంత్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});


(adsbygoogle = window.adsbygoogle || []).push({});