తులసీనగర్ గంగపుత్ర సంఘ భవన నిర్మాణ నిధులకై ఎమ్మెల్సీకి వినతి
జగిత్యాల, నవంబర్ 28, మన భారత్ :
జగిత్యాల పట్టణంలోని 29వ వార్డు తులసీనగర్ గంగపుత్ర సంక్షేమ సంఘం సభ్యులు శనివారం ఎమ్మెల్సీ ఎల్. రమణని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తులసీనగర్లో గంగపుత్ర సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ వారు ఎమ్మెల్సీ గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎల్. రమణ గారు, త్వరలోనే సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అయిల్నేని వెంకటేశ్వర్, జిల్లా మత్స్యకారుల సహకార సంఘం అధ్యక్షులు తోపారపు రజినీకాంత్, పట్టణ మాజీ అధ్యక్షులు గుమ్ముల అంజయ్య, గుమ్ముల జనార్దన్, అరుముల్ల గంగాధర్, నాచుపెల్లి రెడ్డి, తోపారపు శ్రీహరి, అరుముల్ల హరిప్రసాద్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
