manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 9:20 am Editor : user5442714

మేడిగడ్డ దగ్గరే డిబేట్ పెట్టుకుందాం:బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సాగౌడ్

మేడిగడ్డ దగ్గరే డిబేట్ పెట్టుకుందాం
– కొప్పుల ఈశ్వర్ వాఖ్యలు అర్థరహితం
– బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సాగౌడ్
జగిత్యాల/బుగ్గరాం, నవంబర్ 28, మన భారత్ :
సాగునిటీ విషయమై మెడిగడ్డ వద్దే డిబేట్ పెట్టుకుందామని జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై చేసిన విమర్శలకు సమాధానంగా బుగ్గారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు నగునూరి నర్సాగౌడ్ శనివారం బుగ్గారంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్బంగా నర్సాగౌడ్ మాట్లాడుతూ
తుమ్మిడిహెట్టి వద్ద కడితే గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని ఈశ్వర్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా… అని ప్రశ్నించారు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి ఎందుకు కట్టలేదని, కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ దగ్గర వేల కోట్లు వృథా చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు పిల్లర్లు కుంగి నీళ్లు లేకుండా పోయాయని, దానికి ఈశ్వర్ ముందు సమాధానం చెప్పాలన్నారు. డిబేట్ కావాలంటే కరీంనగర్, జగిత్యాలలో కాదు, మేడిగడ్డ దగ్గరే పెట్టుకుందామని నర్సాగౌడ్ సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ ఇచ్చామని బీ ఆర్ ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారని, కానీ డిస్కంలను అప్పుల్లో ముంచి పోయింది మీరు కాదా అని ప్రశ్నించారు. తాము వచ్చాకే అప్పులు తీరుస్తూ రైతులకు ఉచిత కరెంట్ కొనసాగిస్తున్నామని చెప్పారు.

యూరియా కొరత కేంద్రంలోని బీజేపీ వల్లే వచ్చిందని, బీజేపీతో కలిసి తెలంగాణను తాకట్టు పెట్టింది బీఆర్ఎస్సేనని ఘాటుగా విమర్శించారు. ధర్మపురి నియోజకవర్గంలో 150 గ్రామాల్లో తన మార్క్ కనిపిస్తుందని ఈశ్వర్ అంటున్నారని, ఏ మార్క్ అని నర్సాగౌడ్ ప్రశ్నించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ వచ్చిన 2 ఏళ్లలోనే ధర్మపురి, కోటిలింగాలతో పాటు ప్రతి గ్రామానికి రోడ్లు, నీళ్లు, స్కూల్స్ కోసం నిధులు తెచ్చారని తెలిపారు. 10 ఏళ్లు మంత్రిగా చేసిన అభివృద్ధి ఏంటో ధర్మపురి ప్రజలకు తెలుసునని, అందుకే ప్రజలు ఆయన్ను ఇంటికి పంపించారని అన్నారు. మేము మాటలు చెప్పడానికి రాలేదనీ , పని చేయడానికి వచ్చామని నర్సాగౌడ్ పేర్కొన్నారు.

సమావేశంలో బుగ్గారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షులు బీర్పూర్ తిరుపతి, సిరికొండ సర్పంచ్ పంచిత ధర్మరాజు, శేఖల్ల సర్పంచ్ పర్సా రమేష్, చిన్నాపూర్ సర్పంచ్ గట్టు శారద గంగారాం, చందయ్యపల్లె సర్పంచ్ గాదె మహేష్, జిల్లా కార్యదర్శి పెద్దనవేణీ శంకర్, మండల కార్యదర్శి సుధీర్ సింగ్, మండల నాయకులు కుంట మహేష్,గోపాలపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి కేలేటి పోషరాజు , నక్క మధు తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});