ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసిన నిపాని గ్రామస్తులు.. అంబేద్కర్ చిత్రపటం బహూకరణ
ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి మన భారత్, భీంపూర్:నవంబర్ 27, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిపాని గ్రామానికి చెందిన గ్రామస్తులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు అందజేసి బహూకరించారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి సమస్యలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు...