manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 2:15 pm Editor : user5442714

ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసిన నిపాని గ్రామస్తులు.. అంబేద్కర్ చిత్రపటం బహూకరణ

ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మన భారత్, భీంపూర్:నవంబర్ 27,

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిపాని గ్రామానికి చెందిన గ్రామస్తులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ఎమ్మెల్యేకు అందజేసి బహూకరించారు.

ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి సమస్యలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. సీసీ రోడ్లు లేక గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, గ్రామంలోని అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. గ్రామ ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులపై వినతిపత్రం రూపంలో తమ అభ్యర్థనలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, ఇర్ఫాన్, విజయ్, సందీప్, స్వామి తదితరులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});